Breaking News

బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది: తేజస్వీ యాదవ్‌

Published on Sun, 01/28/2024 - 17:27

పట్నా: బిహార్‌లోని మహా కూటమి నుంచి బయటకు వచ్చి  సీఎంగా నితీష్‌ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ మద్దతుతో మరోసారి బిహార్‌ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. మహాకూటమిలో కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నితీష్‌  వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు.

బీజేపీ-జేడీ(యూ) కూటమి ఏర్పాటుపై తాను మాత్రమే బీజేపీకి శుభాకాంక్షలు తెలుపగలనని అ‍న్నారు. జేడీయూను బీజేపీ కూటమిలో కలుపుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌డీఏ కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్‌ నితీష్‌ కుమార్‌ మరోసారి సీఎంగా  ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని అన్నారు. 

నితీష్‌ కుమార్‌ అలసిపోయారని.. ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో ఆర్జేడీ పార్టీ అన్ని రకాలకు సహకరించిందని గుర్తుచేశారు. నితీష్‌పై ప్రస్తుతం తాను వ్యక్తిగతమైన  వ్యాఖ్యలు ఏం చేయనని అన్నారు. ప్రస్తుతం నితీష్‌ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో జేడీ(యూ) పూర్తిగా పట్టు కోల్పోవటం ఖాయమని అన్నారు. నితీష్‌ చేసిన పనికి బిహార్‌ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. వారు(జేడీయూ) ఏం చేసినా బిహార్‌ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తేజస్వీ తెలిపారు. 

చదవండి: ‘నితీష్‌, బీజేపీకి బిహార్‌ ప్రజలు బుద్ధి చెబుతారు’

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)