Breaking News

బిగ్ ట్విస్ట్‌.. మరోసారి శరద్ పవార్‌ను కలిసిన అజిత్ పవార్‌..

Published on Mon, 07/17/2023 - 17:28

ముంబయి: మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌తో అజిత్‌ పవార్‌ కలిసిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్‌ వరుసగా రెండోరోజు శరద్ పవార్‌తో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అజిత్‌ మాట్లాడుతూ.. కేవలం అశీస్సులు తీసుకోవడానికే శరద్ పవార్‌ను కలిశానని అజిత్ పవార్ చెప్పారు.

ఏక్‌నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపిన అజిత్ పవార్‌ మంత్రి పదవులు స్వీకరించిన అభ్యర్థులతో కలిసి నిన్ననే శరద్‌ పవార్‌ను కలిశారు. కాగా.. నిన్న ఆదివారం అయినందున కొంత మంది రాలేకపోయారని నేడు సమావేశం అనంతరం మాట్లాడారు. శరద్ పవార్‌ తమ అభ్యర్థనలను మౌనంగా విన్నారని, ఏమీ మాట్లాడలేదని అజిత్ పవార్ చెప్పారు. 

నేడు మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశం జరిగింది. అయితే.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే ఉంటామని తీర్మాణం చేయాల్సి ఉంది. ఆ తీర్మాణాన్ని స్పీకర్‌కు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అజిత్‌ పవార్ మరోసారి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఢిల్లీలో ఎన్డీయే నిర్వహించనున్న సమావేశానికి అజిత్ పవార్ రేపు వెళ్లనున్నారు.

ఇటీవల నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ సహా పలువురు నేతలు ఆదివారం ముంబైలో శరద్‌ పవార్‌ను కలిశారు. అయితే, శరద్‌ పవార్‌ను కలిసిన వారిలో మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌‌తో పాటు ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ పాటిల్‌ తదితరులు ఉన్నారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని కోరినట్టు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: NCP Leadership Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. పవార్‌ రియాక్షన్‌?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)