Breaking News

లిక్కర్‌ షాపుల లక్కీ డ్రా.. భారీ దోపిడీకి ’కూటమి’ పక్కా డీల్‌

Published on Mon, 10/14/2024 - 15:20

సాక్షి, విజయవాడ: ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది. కూటమి నేతల కనుసన్నల్లోనే మొత్తం తతంగం జరిగింది. లాటరీలోనూ సిండికేట్లదే  హవా కొనసాగింది. ఈ క్రమంలో భారీ దోపిడీకి టీడీపీ నేతలు డీల్‌ సెట్‌ చేశారు. మద్యం ఆదాయంలో కమీషన్‌ ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు.  లాటరీ ద్వారా లైసెన్స్ దక్కితే ఇవ్వాల్సిన కమీషన్‌ను కూడా ముందే ఫిక్స్‌ చేసేశారు. మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకునేందుకు కుట్రకు ప్లాన్ చేశారు.

లైసెన్స్‌ దక్కకపోతే గొడవలు, దాడులకు వ్యూహం పన్నినట్లు సమాచారం. లాటరీ నిర్వహించే ప్రతీ చోట మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే తిష్ట వేశారు. సిండ్‌కేట్‌లో లేకుంటే ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. 

అనంతపురం జిల్లాలో మద్యం టెండర్లలో బీజేపీ నేతల హవా సాగుతోంది. ధర్మవరంలో ఐదు మద్యం షాపులను  బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ దక్కించుకున్నారు. మంత్రి సత్యకుమార్ సన్నిహితుడిగా ఉన్న సందిరెడ్డి శ్రీనివాస్‌కు ఐదు మద్యం షాపులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారుల లాటరీపై మద్యం వ్యాపారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కూటమి నేతల బెదిరింపులు

ఇదీ చదవండి: సర్కారు వారి కమీషన్‌ 30%

ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పగా, చింతమనేని అనుచరులు దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.  పోలీసులపై దుర్భాషలాడి దాడికి యత్నించారు. చలసాని గార్డెన్‌లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ జరిగింది.

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)