Breaking News

కొలికపూడి ప్రగల్భాలు.. గాలి తీసిన టీడీపీ కార్యకర్తలు

Published on Mon, 01/13/2025 - 13:44

సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు గాలి తీసేశారు పచ్చ నేతలు, కార్యకర్తలు. పది రోజుల క్రితం తిరువూరులో జూదం ఆడనివ్వను అంటూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రగల్భాలు పలికారు. కానీ, ఆయన మాటలను కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు ఎవరూ లెక్క చేయలేదు. తిరువూరులో కమీషన్‌ తీసుకుని మరీ టీడీపీ నేతలు పందేలు, జూదం ఆడిస్తున్నారు.

వివరాల ప్రకారం.. తిరువూరులో టీడీపీ నేతలు హల్‌చల్‌ చేస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా కమీషన్లు తీసుకుని పందేలు, జూదం ఆడిస్తున్నారు పచ్చ నేతలు. ఇక, పోలీసులు సైతం జూదం నిర్వాహకులతో కుమ్మక్కు అయినట్టు తెలుస్తోంది. గుండాట, పేకాట, లోనా బయట, గ్యాబ్లింగ్‌ నిర్వహిస్తున్నట్టు సమాచారం. కూటమి నేతలు జూద క్రీడలకు ప్రత్యేక ధరలు నిర్ణయించి అమ్మేసినట్టు స్థానికులు చెబుతున్నారు.  

అయితే, పది రోజుల క్రితమే తిరువూరులో జూదం ఆడనివ్వనంటూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. కానీ, ఆయన మాటలను టీడీపీ కార్యకర్తలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. జూదం ఆడుతున్న శిబిరాల వద్దనే పబ్లిక్‌గా మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయి. మామూళ్లు తీసుకుని ఎక్సైజ్‌ అధికారులు.. మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఇక, అంతకుముందు.. కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహిస్తే ఊరుకోనని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ప్రస్తుతం విచ్చిలవిడిగా జూదం ఆడుతున్నా కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు మాత్రం పట్టించుకోవడం లేదు. తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, కోడి పందెం బరులు , జూద క్రీడల వద్ద పోలీసులు కనిపించకపోవడం విశేషం.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)