Breaking News

ఈ దొంగల్ని నమ్మొద్దు

Published on Sat, 05/04/2024 - 05:25

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): కొత్త వలంటీర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త మోసానికి తెరతీసింది. ఇటీవల రాజీనామా చేసిన వలంటీర్ల స్థానంలో తమ పార్టీకి చెందిన కొందరు యువకులను గ్రామాల్లోని పేదల ఇళ్లకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభా­లకు గురిచేస్తోంది. చిత్తూరు రూరల్‌ మండలంలో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చా­లా­మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 

దీనిని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ఎంపిక చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లుగా మిమ్మల్నే నియమిస్తామని నమ్మబలికారు. వారికి వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 50 ఇళ్లకు ఒకరిని చొప్పున పంపించారు. ఇక వారు పేదల ఇళ్లకు వెళ్లి ‘తాము కొత్త వలంటీర్లం. ఇక వచ్చేది టీడీపీ. కాబట్టి టీడీపీకి ఓటు వేయండి. లేకపోతే ఏ పథకం రాదు..’ అని బెదిరిస్తున్నారు. 

టీడీపీ కరపత్రాలు చూపిస్తూ పింఛన్లు, ఇంటి స్థలం.. అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తు­న్నారు. మరోవైపు పేదల అవసరాలను గుర్తించి ఆర్థికంగా ప్రలో­భాలకు గురిచేస్తున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ కొత్త వలంటీర్ల డ్రామాపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎటువంటి మోసాలకైనా పాల్పడుతుందనేందుకు కొత్త వలంటీర్ల డ్రామా ఒకటని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దొంగలను నమ్మరాదన్న భావనను వారు వెలిబుచ్చారు. దీనిపై కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)