టీడీపీలో దుమారం రేపిన కేశినేని నాని వ్యాఖ్యలు

Published on Mon, 01/01/2024 - 18:32

విజయవాడ:  టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో మరోసారి దుమారం రేపాయి. తన సోదరుడు చిన్నాతో పాటు బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరాలను ఆయన పరోక్షంగా టార్గెట్‌ చేశారు. ఓ వైపు తనతో పాటు తన వర్గాన్ని ప్రమోట్‌ చేసుకుంటూ సొంత పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజవర్గంలో తన కుమార్తె శ్వేత పోటీ చేయడం లేదని చెప్పారు.

కొన్ని కబంధ హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గానికి విముక్తి చేయడానికే తాను ఇంఛార్జ్‌గా వచ్చానని తెలిపారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని తాను సహించనని కేశినేని నాని హెచ్చరించారు. మేం ఏలుకుంటాం.. దోచుకుంటాం అంటే ఊరుకునేది లేదన్నారు. తాను ఎవరి చీకటి వ్యాపారాల్లో వాటాదారుడిని కాదని అన్నారు. అందుకే వాళ్లతో తనకు పడదని  చెప్పారు.

తాను వెళ్లిపోతే విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు దోచుకోవచ్చనేదే వారి అజెండా అని తీవ్రంగా విమర్శించారు. తాను తినను.. ఎవ్వరీని తిననివ్వను.. అనేదే వాళ్ల బాధని పరోక్షంగా విమర్శలు చేశారు. కేశినేని నాని అనే వ్యక్తి ఎంపీగా లేకపోతేనే వాళ్లకు సంతోషమని అన్నారు. 

చదవండి: Tuni TDP Clashes: తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

Videos

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)