Breaking News

కూటమిలో ట్విస్ట్‌.. జనసేన కారణంగా టీడీపీ కీలక నేతల రాజీనామా

Published on Thu, 04/17/2025 - 11:34

సాక్షి, తూర్పు గోదావరి: ఏపీలో కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర​ రావు రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

వివరాల ప్రకారం.. నిడదవోలులో ఎన్డీయే కూటమిలో  విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలివెన్నులో కార్యకర్తల సమావేశంలో టీడీపీ కేడర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక, నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

మరోవైపు.. తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడంలో ఎలాంటి సమాచారం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదని అసహనం ప్రదర్శించారు. అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు. 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)