Breaking News

టీడీపీలో అసమ్మతి.. ఎమ్మెల్యేకు సీనియర్ల బిగ్‌ షాక్‌!

Published on Mon, 09/22/2025 - 10:37

సాక్షి, వైఎస్సార్‌: కడప టీడీపీలో అసమ్మతి సెగలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డికి వ్యతిరేకంగా పచ్చ పార్టీ శ్రేణులు బహిరంగంగా నిరసనలకు దిగాయి. దీంతో, టీడీపీలో నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి.

వివరాల ప్రకారం.. కడపలో టీడీపీ సీనియర్‌ నాయకుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీనియర్‌ కార్యకర్తలు, నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం వారంతా దేవునికడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి మంచి బుద్ది ప్రసాదించాలని పూజలు చేశారు. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశారు. ఆది నుంచి ఇప్పటి వరకు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఇక, ఇటీవల టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను మాధవీ రెడ్డి తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ వ్యవహారమై.. వారంతా కమలాపురం సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని కలవనున్నట్టు తెలిపారు. టీడీపీ కోసం పనిచేసిన తమని గుర్తించి.. ఆదుకోవాలని పచ్చ పార్టీ నాయకులు కోరుతున్నారు. దీంతో, టీడీపీలో అసమ్మతి వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: అప్పులపై బాబు, పవన్‌ డ్రామాలు బట్టబయలు..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)