Breaking News

మంత్రి నిమ్మల పర్యటనకు టీడీపీ నేతలు దూరం

Published on Sun, 09/22/2024 - 12:16

సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో ఇరిగేషన్ మంత్రి పర్యటనలో టీడీపీ నేతల వర్గ విభేదాలు బయటపడ్డాయి. మల్యాలలోని హంద్రీనీవా సృజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు జయసూర్య, కేఈ శ్యాంబాబు పరిశీలించారు.

అయితే, మంత్రి రామానాయుడు పర్యటనకు టీడీపీ నాయకులు ఎంపీ బైరెడ్డి శబరి,టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ దూరంగా ఉండటం చర్చాంశనీయంగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే మంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘సాక్షి’పై మంత్రి నిమ్మల అక్కసు
మరోవైపు, ‘సాక్షి’పై మంత్రి నిమ్మల అక్కసు వెళ్లగక్కారు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చి వంద రోజులే అయ్యిందని, మమ్మల్ని ప్రశ్నించే అర్హత జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు చేశారో చెప్పే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.

జగన్‌ తరఫున సాక్షి పత్రికైనా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట వంద రోజుల పాలన పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ పత్రికపై తన అక్కసు వెళ్లగక్కారు. ‘సాక్షి’ పేపర్‌ చదవొద్దని చెప్పారు. త్వరలో సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలుచేస్తామన్నారు.  

మహిళల నుంచి స్పందన నిల్‌.. 
రాష్ట్రంలో వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టామని.. సంక్షోభంలో కూడా సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నిమ్మల వివరించగా కార్యక్రమానికి హాజరైన మహిళల్లో ఒక్కరు కూడా హర్షధ్వానాలు తెలుపకపోవడం మంత్రితో పాటు టీడీపీ నాయకులను విస్మయానికి గురిచేసింది.

అంతకుముందు మాట్లాడిన జనసేన నేత యు.ప్రేమ్‌కుమార్‌ మంత్రి గురించి గొప్పలు చెప్పే ప్రయత్నం చేసినా మహిళలు స్పందించలేదు. దీంతో ప్రేమ్‌కుమార్‌.. అమ్మా మీరు చప్పట్లు కొడితే మంత్రిగారిని అభినందించినట్లు అవుతుందని అనగా.. కొద్దిమంది మాత్రమే మొక్కుబడిగా స్పందించారు.     
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)