Breaking News

పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!

Published on Thu, 06/27/2024 - 11:45

పల్నాడు, సాక్షి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమేర శివ అడ్డుగా నిలబడ్డారు. 

.. పిన్నెల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి.. మెజిస్ట్రేట్‌ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శివపైన అనేక కేసులు పెండింగ్‌లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్‌ షీట్‌ సైతం తెరిచారు.  

ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్‌ చేయడంతో.. పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10గం. టైంలో మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఇక.. పిన్నెల్లిని కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన టైంలో ఆయన ప్రత్యర్థి వర్గం బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే యత్నం చేసింది.

ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట, మార్గంలో పెద్ద ఎత్తున పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)