Breaking News

సచివాలయ ఉద్యోగిపై ‘తమ్ముడి’ శివాలు

Published on Fri, 09/20/2024 - 11:38

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తనకు సమాచారం ఇవ్వకుండా రాయితీపై ప్రభు­త్వం అందజేసే ఉలవలు ఎలా పంపిణీ చేస్తావంటూ టీడీపీ నాయకుడు వెంకటేష్‌ బండ బూతులతో సచివాల­య హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌పై వీరంగం చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటలో జరిగిన ఈ ఘటన.. టీడీపీ చోటామోటా నాయకులు కూడా ప్రభు­త్వ యంత్రాంగంపై విరుచుపడుతున్న తీరుకు అద్దంపడుతోంది.

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఉలవ విత్తనాలు అందజేస్తోంది. పరిగి మండలంలోని వ్యవసాయాధికారులు ఈ నెల 12 నుంచి ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాసనకోటలో 13వ తేదీ విత్తన పంపిణీ జరగాల్సిన ఉన్నా.. స్థానిక టీడీపీ నాయకుల బెదిరింపుతో మండల వ్యవసాయాధికారులు వాయిదా వేశారు. 14వ తేదీ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులతో కలిసి సచివాలయ ఉద్యోగులు ఆర్బీకే పరిధిలోని గ్రామ పంచాయతీ రైతులకు ఉలవ విత్తనాలను పంపిణీ చేశారు.

ఆపై వరుస సెలవులు రావడంతో మంగళవారం ఉలవ విత్తనాల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రావాలని అదే రోజు సచివాలయ ఉద్యోగి పవన్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ను ఆహ్వానించేందుకు ఫోన్‌ చేశారు. అయితే తనకు తెలియకుండా రైతులకు విత్తనాలు ఎలా పంపిణీ చేస్తావంటూ ఆ టీడీపీ నేత వెంకటేష్‌ బూతు పురాణానికి తెరలేపాడు.

ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం

‘ఈ వెంకటేశ్‌ గాడు పెద్ద క్రిమినల్‌.. వైకాపా నా కొడుకులతో నీ వేషాలు సరిపోతాయి.. నాతో కాదు.. అంటూ పచ్చి బూతులతో ఆ ఉద్యోగిపై విరుచుకు పడ్డాడు. ఆ ఉద్యోగిని బండబూతులు తిట్టిన ఆడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుడయిన శాసనకోట వెంకటేష్‌ ఓ అధికారిని అంతలా దూషిస్తూ మాట్లాడిన తీరు విమర్శలపాలవుతోంది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)