Breaking News

విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ!.. టీడీపీకి బిగ్‌ షాక్‌?

Published on Thu, 07/17/2025 - 08:53

సాక్షి, చీరాల: ‘తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరకు నన్ను నిలువునా మోసం చేసి చంపేశారు. మూడు సార్లు నాకు అన్యాయమే జరిగింది. చివరి వరకు ఆశ పెట్టుకున్న చైర్మన్‌ పదవి కల్పించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఏదైనా విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ..!’ బాపట్ల జిల్లా, చీరాల మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్‌ పొత్తూరి సుబ్బయ్య ఆవేదనా పూరిత వ్యాఖ్యలివి.

వివరాల్లోకి వెళితే, మే 14న చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన అనంతరం, బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్‌ స్థానానికి పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లు బలంగా వినిపించాయి. ఎన్నికకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేయగా, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్‌గా ఎంపీ ప్రతిపాదించగా, ఆ­య­న ఎన్నికయ్యారు.

అప్ప­టి వరకు తనకే ఆ అవకాశం దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్న  సుబ్బయ్యకు తీవ్ర పరాభవం ఎదురైంది. వెంటనే ఆయన కౌన్సిల్‌ హాలు నుంచి కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి 16 వేల ఓట్లు ఉన్నాయని, 83 శాతం ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించామన్నారు. గతంలో­నూ రెండు సార్లు తనకు చైర్మన్‌ పదవి విషయంలో అన్యాయం జరిగిందన్నారు.  14 రకాల ఆస్తులుంటే పార్టీ కోసం 12 అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు.  అమ్ముకోవడానికి ఇక మి­గి­లింది కిడ్నీలు, లివర్‌ మాత్రమేనని వాపోయారు.  

వైఎస్సార్‌సీపీని కాదనుకొని వస్తే.. ఇంత అన్యాయమా? 
వైఎస్సార్‌సీపీని కాదనుకొని టీడీపీలో చేరితే ఇంత అన్యాయం చేస్తారనుకోలేదని  పొత్తూరి వాపోయారు. తాను ఇక పార్టీలో ఉండలేనని పేర్కొంటూ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేస్తానన్నారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)