జేసీ అరాచకం.. కేతిరెడ్డిపై దాడికి స్కెచ్‌

Published on Thu, 01/22/2026 - 18:22

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరాచకాలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ, ఆయన అనుచరులు తాడిపత్రిలో పెద్ద స్కెచ్‌ వేశారు. తాడిపత్రిలో ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పేక్షక పాత్ర పోషించడం గమనార్హం.

తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అధికార కూటమికి సవాల్‌ విసిరారు. తాడిపత్రిలో 30 ఏళ్ల జేసీ పాలనకు, ఐదేళ్ల తన పాలనపై చర్చకు రెడీ అని చెప్పుకొచ్చారు. అయితే, కేతిరెడ్డి సవాల్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ, కేతిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు. రేపు(శుక్రవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు టీడీపీ నేతల జనసమీకరణ చేశారు.

ఇందులో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు స్కెచ్‌ రచిస్తున్నట్టు తెలిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో జేసీ వర్గీయులు ప్రత్యేక లారీల్లో రాళ్లు తీసుకొచ్చి.. కేతిరెడ్డి ఇంటి వద్ద పోశారు. దాడి చేసేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కంకర రాళ్లు సిద్ధం చేసుకున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి చేసేందుకు స్కేచ్ తెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)