కేతిరెడ్డి ఇంటిని కూల్చేస్తా.. జేసీ ప్రభాకర్‌ బరితెగింపు

Published on Sun, 03/23/2025 - 09:19

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే కారణంగా ఇష్టానుసారం వ్యవహరిస్తు‍న్నారు తాజాగా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు దిగారు.  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తానని వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. తాడిప‍త్రిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు నేతల ఇళ్లను స్వయంగా తానే కూల్చివేస్తానని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. స్వయంగా ఆర్డీవో కేశవ్ నాయుడు ఎదుటే జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, పోలీసుల వైఫల్యం వల్లే తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాను అంటూ ప్రభాకర్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో, జేసీ వ్యాఖ్యలు, ఆయన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతా జరిగినా పోలీసులు స్పందించకపోవడం విశేషం. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)