Breaking News

ఎన్నికల బాండ్లలోనూ తిరకాసే!

Published on Fri, 03/22/2024 - 12:18

ఎన్నికల బాండ్ల విషయంలో ఎల్లో మీడియా ఏడుపులు మాములుగా లేవు. అయితే.. ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఎలక్టోరల్‌ బాండ్ల రూపేణా భారీగానే డబ్బును మూటగట్టుకుంది. ఇక గుర్తింపులేని జనసేన కూడా ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. గురువారం సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నంబర్ల ద్వారా ఏయే పార్టీకి ఎంత విరాళం అందిందో స్పష్టంగా వెల్లడైంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి 2019 ఏప్రిల్‌ నుంచి 2023 సెప్టెంబర్‌ దాకా రూ.80 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందర సీన్‌ మారింది. కేవలం అక్టోబర్‌ 2023 నుంచి ఫిబ్రవరి మధ్యలోనే రూ. 130 కోట్లను విరాళంగా టీడీపీ స్వీకరించింది. మొత్తంగా టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపేణా వచ్చిన రూ. 212 కోట్లలో 55 శాతం ఫండింగ్‌.. అంటే సుమారు రూ. 118 కోట్లు కేవలం ఒక్క జనవరిలోనే అందడం గమనార్హం. 

టీడీపీకి ఎన్నికల బాండ్లు విరాళాలుగా సమర్పించిన వాళ్లలో.. షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ రూ.40 కోట్లు, మేఘా ఇంజనీరింగ్‌ రూ.28 కోట్లతో రెండోస్థానంలో నిలిచాయి.  యూపీ పవర్‌ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.20 కోట్లు, నాక్టో ఫార్మా లిమిటెడ్‌ రూ.14 కోట్లు, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ లిమిటెడ్‌ రూ.13 కోట్లు.. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల​ లిమిటెడ్‌ రూ.10 కోట్లు ఎన్నికల బాండ్లు టీడీపీకి విరాళంగా  ఇచ్చిన వాళ్లలో ఉన్నారు. ప్రముఖ విద్యాసంస్థ అయిన శ్రీ చైతన్య స్టూడెంట్‌ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ తరఫున రూ. 5 కోట్లు ఇచ్చింది. 

ఇక జనసేన సంగతి భిన్నంగా ఉంది. సాధారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు వచ్చిన దాఖలాలు లేవు. అయితే.. బీజేపీ, టీడీపీ కూటమి భాగస్వామి, జనసేన మాత్రం ఎలక్టోరల్‌ బాండ్లను స్వీకరించింది.  పవన్‌ కల్యాణ్‌ పార్టీకే కాదు..  2019-21 మధ్య గుర్తింపు లేని ఏ ఒక్క పార్టీకి కూడా విరాళాలు రాలేదు. కానీ, 2022 జనసేనకు రూ.22 కోట్లు, 2023లో మరో రెండు కోట్లు, 2024లో ఏకంగా 17 కోట్ల రూపాయలు.. మొత్తంగా 21 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి. కొత్త పార్టీలు లేదంటే మునుపటి ఎన్నికల్లో తగినన్ని ఓట్లను సంపాదించని రాజకీయ పార్టీలను గుర్తింపు లేని పార్టీలుగా ఈసీ ప్రకటిస్తుంది. తద్వారా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న గుర్తింపు లేని పార్టీగా జనసేన నిలవడం కొసమెరుపు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)