Breaking News

పోలీసులే ఫిర్యాదు చేసి.. పోలీసులే కేసు నమోదు!

Published on Mon, 03/10/2025 - 22:05

ఏలూరు:  టీడీపీ ఆదేశాలతో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ  చెలరేగిపోతోంది. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది కూటమి ప్రభుత్వం.  ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై అక్రమ కేసులు బనాయించారు దెందులూరు పోలీసులు. తన నివాసం వద్ద ఉన్న కామిరెడ్డి నాని.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ రివర్స్ కేసులు పెట్టారు ఏపీ పోలీసులు.  

ఈ కేసులో పోలీసులే ఫిర్యాదు చేసి.. వాళ్లే కేసు నమోదు చేయడం  గమనార్హం.  కామిరెడ్డి నానిపై హెడ్ కానిస్టేబుల్ హమిద్ ఫిర్యాదు చేయగా, ఎస్పై శివాజీ కేసు నమోదు చేశారు. 132R/w 3(5)bns సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఏపీలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తువారిపై,  కూటమిలో ఉన్న పార్టీలపై గతంలో విమర్శలు చేసిన వారిపై టీడీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం రాసుకుంటున్నానని గతంలో ఏదైతే చెప్పారో అదే అమలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తోంది. 

ఏదొక అక్రమ కేసును వారిపై మోపి.. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది.  ఇందుకు రాష్ట్ర పోలీసులు కూడా సహకరిస్తూ ఉండటంతో అక్రమ కేసుల పరంపరంకు అడ్డుకట్టలేకుండా పోతోంది.  కూటమి ప్రభుత్వం అరాచకపాలను ప్రశ్నిస్తే చాలు ఏదొక అక్రమ కేసును చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రశ్నిస్తేనే తప్పు అన్నట్లుగా ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)