Breaking News

జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాల దాడి

Published on Sun, 02/01/2026 - 16:52

సాక్షి,విజయవాడ: ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ ఇంటికి వందలాది టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పెట్రోల్‌ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడికి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో జోగి రమేష్‌ నివాసం అగ్నిప్రమాదం చోటు చేసుకుని మంటలు, పొగలు ఎగిసి పడుతున్నాయి. 

జోగి ఇంటి ముందు టీడీపీ గూండాలు ఫ్లెక్సీలు పీకి పడేశారు. టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోకకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగే సమయంలో జోగి రమేష్‌ తండ్రి, ఆయన సతీమణి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్‌ తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నారు.   

నా కుటుంబం హత్యకు కుట్ర  
పెట్రోల్‌ బాంబులు వేసిన తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడులకు తెగబడ్డారు.అయితే,ఈ దాడుల్ని జోగి రమేష్‌ ఖండించారు. ఘటన జరిగే సమయంలో తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు,లోకేష్‌ నన్ను మట్టు బెట్టాలనుకున్నారా?
ఏపీలో విధ్వంసకాండ జరుగుతోంది. నా ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు సారధ్యం.. లోకేష్‌ నేతృత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రీతిలో దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు,లోకేష్‌ నన్ను మట్టు బెట్టాలనుకున్నారా?.నన్ను,నా పిల్లలను దహనం చేయాలని అనుకున్నారా?. పెట్రోల్‌ బాంబులు వేసి నా కుటుంబాన్ని హత్య చేసే కుట్ర.గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను దించి దాడులు చేస్తున్నారు.  

ప్రభుత్వమే పెట్రోల్‌ బాంబులు వేయిస్తోంది.మా ఇళ్లపై దాడులు చేస్తే వైఎస్సార్‌సీపీ జెండాను వీడుతామా?. వైఎస్సార్‌,వైఎస్‌ జగన్‌ అడుగుజాడల్లో నడిచేవాళ్లం మేం. ప్రజాగొంతుకలపై దాడి చేస్తారా?. మీ దాడులను ప్రజలు క్షమించరు. ఇప్పటికే మీరు హద్దు మీరిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలు జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వం ప్రజల్లో అసహ్యం పెరిగింది. లోకేష్‌ నీ పిల్ల చేష్టలు, రాక్షసానందం మానుకో. ఈ దాడులను రాష్ట్ర ప్రజలు ఖండించాలి. అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం. ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో మమేకం అవుతాం. దాడులు జరుగుతుంటే పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. 

 

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)