Breaking News

బరితెగించిన టీడీపీ మాజీమంత్రి.. డబ్బు తీసుకుని పనిచేయాలని ఒత్తిడి

Published on Tue, 08/22/2023 - 10:53

సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు హయాంలో ‘తెలుగు తమ్ముళ్లు’ లంచాలు, దౌర్జన్యాలతో పనులు కానిచ్చు­కున్నట్లుగానే ఇప్పుడూ బరితెగిస్తున్నారు. తమ పనులు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికారులకు డబ్బులు ఎరగా వేసేందుకూ వెనుకాడడంలేదు. ఇందుకు తాజాగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండల రెవెన్యూ అధికారికి లంచం ఇచ్చేందుకు ఏకంగా టీడీపీ మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డే ప్రయత్నించిన ఫొటోలు బయట­కొచ్చాయి. ఆ వివరాలు.. కదిరిలో పల్లె రఘునాథరెడ్డికి సంబంధించి శ్రీవివేకానంద పేరుతో డిగ్రీ కాలేజీ ఉంది.

కాలేజీకి సెక్యూరిటీ కార్పస్‌ ఫండ్‌ కోసం సైదాపురం రెవెన్యూ పొలంలో 38/1, 38/2, 38/5, 38/6 సర్వే నంబర్లలోని 4.5 ఎకరాల స్థలాన్ని పూచీగా చూపించారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని సుమారు 88 ప్లాట్లుగా విభజించి క్రయవిక్ర­యాలు చేస్తున్నారు. ఎలాంటి హద్దులు చూపకుండానే అమ్మకాలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి.. అనుమతుల్లేవని తేల్చారు. ఈ తతంగం చాలారోజుల క్రితమే జరిగింది. ప్రస్తుతం ఈ స్థలానికి అధికారిక అనుమతులివ్వాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, వారు ససేమిరా అన్నారు. 
చదవండి: బండారూ.. తప్పుడు ప్రచారం మానుకో..

డబ్బు ఎరగా చూపి..
రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి పల్లె రఘునాథ­రెడ్డిపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో పలుమార్లు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి అనుమతులివ్వాలని కోరారు. లంచాలు ఇచ్చేందుకూ ప్రయత్నించారు. డబ్బు వద్దని.. నిబంధనల ప్రకారమే పనిచేస్తామని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. తాజాగా.. సోమ­వారం ఉదయం కూడా కదిరి తహసీల్దార్‌ కార్యాల­యానికి వెళ్లిన పల్లె రఘునాథరెడ్డి తన చేతిలో ఇలా­‘నోట్లు’ పట్టుకుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమా­ల్లో వైరల్‌ అయ్యాయి.

మోసపూరిత బుద్ధి మానుకుంటే మంచిది : ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
అవినీతికి పాల్పడటం, అక్రమాలు చేయడం టీడీపీ నేతలు మానుకుంటే మంచిది. సెక్యూరిటీ కార్పస్‌ ఫండ్‌కు అనుమతులు తీసుకున్న స్థలంలో ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం సరికాదు. మున్సిపల్‌ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. ఎలాంటి అనుమతులివ్వడం సాధ్యంకాదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. అయితే.. డబ్బులతో అధికారులకు గాలం వేయాలని పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)