Breaking News

శ్రీకాళహస్తిలో రెస్టారెంట్‌ కూల్చివేత కక్షసాధింపే

Published on Tue, 12/17/2024 - 04:08

తిరుపతి మంగళం : శ్రీకాళహస్తిలో రివర్‌ వ్యూ రెస్టారెంట్‌ కూల్చివేత కూటమి ప్రభుత్వ కక్షసాధింపే అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రివర్‌ వ్యూ రెస్టారెంట్‌ కూల్చివేతను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్‌ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీకాళహస్తిని మధుసూదన్‌రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

చంద్రబాబు బెదిరింపులకు, కేసులకు భయపడే తత్వం వైఎస్సార్‌సీపీ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచి్చన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ప్రజలు గ్రహిస్తున్నారని, చంద్రబాబుకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)