Breaking News

అసలు చంద్రబాబు అరెస్ట్‌కి, తిరుమలకు ఏం సంబంధం?

Published on Sun, 10/01/2023 - 08:31

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకో­ణంలో అరెస్టయిన చంద్రబాబు విశ్వరూపం బయటపడుతుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. దీంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలతో ఆ పార్టీకి కనీస సానుభూతి కూడా రావడంలేదు. అయినా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలను ఏమార్చడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌ శృతిమించింది. తిరుమల పవిత్రతను మంటగలిపేలా టీడీపీ శ్రేణులు ప్రవర్తించారు. ఉనికి కోసం టీడీపీ చావు తెలివితేటలు ప్రదర్శిస్తోంది.

పచ్చ పార్టీ నాయకులు ఎందుకు తిరుమలను లక్ష్యంగా చేసుకొని గత పది రోజులుగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనే పేరుతో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం జెండాలతో ఫోటోలు తీసి రాజకీయం చేయాలని చూస్తున్నారు?. చివరికి స్టీలు గ్లాసులతో తెలుగుదేశం పార్టీ మోత మోగించు అనే నిరసన కార్యక్రమాన్ని కూడా తిరుమలలో చేయాలని చూడడం ఏవగింపు కలిగిస్తుంది. ఈ విషయంపై హైందవులు, తిరుమల శ్రీవారి భక్తులు తెలుగుదేశం పార్టీ వైఖరిని చీదరించుకుంటున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకి మద్దతుగా గత పది రోజులుగా ఏదో ఒక విధంగా తెలుగుదేశం జెండాను చూపిస్తూ ఫోటోలు దిగి సామాజిక ఉద్యమాల్లో సర్కులేట్ చేయడం ద్వారానో లేక తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న నిరసనలతో తిరుమలలో వివాదాస్పదం చేసి, అధికార పక్షాన్ని ఇరకాటంలోకి పెట్టాలని శతవిధాల  తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు.

తెలుగు తమ్ముళ్లు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహాన్ని హైందవ సంఘాలు, తిరుమల శ్రీవారి భక్తులు తిప్పి కొట్టడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. చివరికి టీడీపీ నిర్వహిస్తున్న మోతు మోగిద్దాం నిరసన కార్యక్రమానికి మద్దతుగా  సీహెచ్ భగవాన్, రామ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా విజయవాడ నుంచి తిరుమలకు వచ్చి స్టీల్ గ్లాసులతో చప్పుడు చేస్తూ మొబైల్ ద్వారా వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుకున్నారు. టీడీపీ ఎంత నీచానికి ఒడిగట్టిందో ఈ విషయంతోనే అర్థమవుతుంది. ఇదే విధంగా 2009 ఎన్నికల సమయంలో కూడా తెలుగు తమ్ముళ్లు ఇదే అత్యుత్సాహం ప్రదర్శించి చతికిల పడిన విషయం మర్చిపోతున్నారు.
చదవండి: నోటీసుల్లో లోకేష్‌కు సీఐడీ ఏం చెప్పిందంటే..?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)