Breaking News

తాడిపత్రిలో టెన్షన్‌.. టెన్షన్‌

Published on Sat, 09/20/2025 - 07:35

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందుకొచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు ఓవరాక్షన్‌కు దిగాయి. దీంతో, పోలీసులు కలుగజేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. 

ఇక, అంతకుముందు.. పెద్దారెడ్డి పోలీసు బందోబస్తు మధ్య  శుక్రవారం ఉదయం తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి వెనుక వైపునున్న ప్రహరీ కొంత తొలగించి గేటు నిర్మాణం చేపట్టారు. అయితే, అది నచ్చని జేసీ మున్సిపల్‌ అధికారులను ఉసిగొల్పి గేటును ధ్వంసం చేయించి యథావిధిగా గోడ నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో సోషల్‌ మీడియా ద్వారా తన అనుచరులను వెంటనే రావాలంటూ జేసీ మెసేజ్‌ పెట్టారు. అనుచరులు తన ఇంటి వద్దకు చేరుకోగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి వారితో కలిసి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందున్న కళాశాల క్రీడా మైదానంలోకి చేరుకున్నారు. కేకలతో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. అదే సమయంలో ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ పోలీసు బలగాలతో వచ్చి వారిని వెనక్కి పంపడంతో సమస్య సద్దుమణిగింది. 

మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమన్వయం పాటించాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. అనంతరం, జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు వెనక్కి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)