Breaking News

ఆ సీటు నాదే అంటున్న మాజీ మంత్రి..!

Published on Sun, 02/11/2024 - 16:40

కైకలూరు సీటు కోసం టీడీపీ -జనసేన నేతల మధ్య  పోరు జరుగుతోంటే  పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చబోతోందా? కైకలూరు సీటు నాదే అంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? టీడీపీ ఆవిర్భవించాక కైకలూరు ప్రజలు ఒక్కసారే ఆ పార్టీని గెలిపించారు. అయినా కైకలూరు కోసం ఎందుకు పోటీ పడుతున్నారు? టీడీపీ, జనసేన మధ్యలోకి వచ్చిన ఆ నేత ఎవరు? ఆ మాజీ మంత్రి ప్రయత్నాలు ఫలిస్తాయా?

కైకలూరు నియోజక వర్గానికి  ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో పది సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.  టిడిపి, బిజెపి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి.  ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు  ప్రభంజనం వీచినా కైకలూరులోటీడీపీ ఓటమి చెందింది. 1994లో మరోసారి ఎన్టీయార్ ప్రభంజనం వీచిన సందర్భంలో కూడా కైకలూరులో  టిడిపి గెలవలేకపోయింది. ఎన్టీయార్ తర్వాతటీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడికి కూడా కైకలూరు నియోజక వర్గం కొరుకుడు పడలేదు. ఇక్కడి ప్రజల నాడి పట్టుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ  టిడిపికి కైకలూరు పై పెద్దగా ఆశలు లేవంటున్నారు. కాకపోతే ఎన్నికల నగారా మోగితే మొక్కుబడిగానైనా పోటీ చేయాలి కాబట్టిటీడీపీ పోటీ చేయాలంతే.

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావుటీడీపీ అభ్యర్ధి జయమంగళ వెంకటరమణపై  విజయం సాధించారు.టీడీపీ ఆవిర్భవించాక ఒకే ఒక్కసారి కైకలూరులో 2009లో  విజయం సాధించింది. అపుడు టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ  ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్  పై గెలిచారు. 2014 లో  ఇదే కామినేని శ్రీనివాస్ బిజెపి అభ్యర్ధిగా  బరిలో దిగి గెలవడమే కాకుండా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జయమంగళ వెంకటరమణను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం మానేసింది. దాంతో ఏడాది క్రితమే ఆయనటీడీపీకి గుడ్ బై  చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్ లో చేరారు. చంద్రబాబు నాయుడి వైఖరి,టీడీపీ సిద్ధాంతాలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు జయమంగళ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.

2009లోటీడీపీ జెండా ఎగరేసిన జయమంగళ వెంకటరమణ పార్టీని వీడ్డంతోటీడీపీకి బలమైన అభ్యర్ధే లేకుండా పోయారు. ఫలితంగా కొత్తగా ఇన్ ఛార్జ్ ని పెడదామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. కైకలూరు నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ఉండండయ్యా అని చంద్రబాబు నాయుడు  అదే పనిగా పిలుస్తోన్నా ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ప్రస్తుతం  కొత్త అభ్యర్ధి వేటలో పడ్డారు చంద్రబాబు నాయుడు. జయమంగళ నిష్క్రమణతోటీడీపీకి బలమైన అభ్యర్ధులు లేని నేపథ్యంలో కైకలూరును తమ ఖాతాలో రాసేసుకోవాలని జనసేన  భావిస్తోంది. పొత్తులో భాగంగా  కైకలూరు నియోజక వర్గాన్ని తమకి కేటాయించాలని   జనసైనికులు  డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కోసమే కైకలూరు నియోజక వర్గంలో బలోపేతానికి జనసేన రక రకాల ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు పై ఒత్తిడి పెంచడానికి జనసైనికులు ప్రయత్నిస్తున్నారు. 

గత ఎన్నికల్లో కైకలూరు నియోజక వర్గం నుండి  జనసేన తరపున  పోటీ చేసిన బి.వి.రావు   ఓటమి చెందినప్పటికీ  పదివేల పై చిలుకు ఓట్లు సంపాదించుకోగలిగారు. ఈ తర్వాత నియోజక వర్గంలో తన గ్రాఫ్ మరింతగా పెరిగిందని.. తాను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నానని  బి.వి.రావు  చెప్పుకుంటున్నారు. తనకు కైకలూరు సీటు ఇస్తే   కచ్చితంగా  విజయం సాధిస్తానని  ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.టీడీపీ జనసేనల మధ్య సీట్ల సద్దుబాటు  ఇంత వరకు కొలిక్కి రాలేదు. ఈ సీటు కోసం  జనసేన విస్తృతంగా  ప్రయత్నాలు చేస్తూ ఉంటే  సందట్లో సడేమియాలా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అమాంతం నిద్రలేచి   రంగంలో దూకేశారు. చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ ఇద్దరూ తనకు బాగా క్లోజ్ అంటోన్న కామినేని ఈ సీటు నాదే అని టీడీపీ-జనసేన క్యాడర్ తోనే అంటున్నారట.

జయమంగళ వెంకటరమణ పార్టీని వీడ్డంతో  సీటు తమకి వస్తుందని స్థానిక  టీడీపీ నేతలు ఆశలు పెట్టుకుంటే  జనసేన , బిజెపి నేతలు  ఇదే సీటుపై కర్చీఫ్ వేసుకోవడం తెలుగు తమ్ముళ్లకు  కునుకులేకుండా చేస్తోంది. అయినా ఓడిపోయే సీటుకోసం ఇంత పోటీ అవసరమా అని రాజకీయ పండితులు  సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇంత వరకు కైకలూరు సీటు వైపు  చూడలేదు. ఈ సీటును జనసేనకు కేటాయించాలా వద్దా అన్నది కూడా ఆయన నిర్ణయం తీసుకోలేదు. చివరి నిముషంలో కామినేని శ్రీనివాసే టీడీపీ  అభ్యర్ధిగా బరిలోకి దూకినా ఆశ్యర్యపోనవసరం లేదంటున్నారు  రాజకీయ విశ్లేషకులు. ఇటువంటి చిత్ర విచిత్ర రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని వారంటున్నారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)