Breaking News

 యాత్ర–2పై ఫేక్‌ జీఓ విడుదల చేసి రాక్షసానందం

Published on Fri, 02/09/2024 - 09:14

సాక్షి, అమరావతి :ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పచ్చ మీడియా బరితెగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా విభాగాలు రోజుకో రీతిలో విషం చిమ్ముతున్నాయి. తాజాగా ‘యాత్ర 2’ సినిమా పైనా ఈ తరహా దుష్ప్రచారానికి తెరతీశాయి. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆయన పాదయాత్ర కథాంశంగా చేసుకుని నిర్మించిన ఈ సినిమాపై సహజంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇది చంద్రబాబు, పవన్‌లకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారి అనుచరులు ఆ సినిమా పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఓ ఫేక్‌ జీఓను సృష్టించి వైరల్‌ చేశాయి.

ఆ  సినిమాను అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, వలంటీర్లు తదితరులు మొదటి రెండు రోజులు చూసేలా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తున్నట్టు ఆ ఫేక్‌ జీఓ సృష్టించారు. ప్రతి వలంటీర్‌ తమ పరిధిలో 10 మందిని సినిమాకు తీసుకురావాలని... అందుకోసం వారికి 10 సినిమా టికెట్లు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అందులో నిర్దేశించినట్టు చూపించారు.

రోజూ సినిమా కలెక్షన్లు ఎంతో కూడా కలెక్టర్లే లెక్కించి నివేదించాలని ఏడో తేదీన విడుదల చేసినట్టున్న ఆ జీఓలో పొందుపరిచారు. అయితే దీనిని సృష్టించిన పచ్చ సోషల్‌ మీడియా ఆ ఉత్తర్వులు విడుదల చేసినట్టు చూపించిన నీలం సాహ్ని ప్రస్తుతం సర్వీసులో లేరన్న విషయం గమనించలేదు. ఆమె రెండేళ్ల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేయగా ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయమూ కోరలేదు. కేవలం సినిమాపై ప్రతికూలత తీసుకువచ్చేందుకే పచ్చ మీడియా ఈ కుట్రకు పాల్పడింది. శుక్రవారం విడుదలైన సినిమా ఘన విజయం సాధించింది.  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి