Breaking News

బాబు కుంభకోణాలన్నీ బయటకొస్తాయి

Published on Tue, 09/12/2023 - 04:27

కొవ్వూరు/ఆరిలోవ (విశాఖ తూర్పు): చంద్రబాబు అవినీతి కుంభకోణాలన్నీ బయటకొస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. నేరం చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబునాయుడుకి విధేయు­లుగా ఉన్న కొందరు చట్టాన్ని తప్పుపట్టటం సరికాదని పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష­­్టమైన సాక్ష్యా­దారాలున్నందునే న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించిందని చెప్పారు.

చంద్రబాబు జైలుకెళ్లడం పట్ల ప్రజలు సంతోషంతో ఉన్నారని, అందుకే టీడీపీ చేపట్టిన బంద్‌లో ప్రజలు పాల్గొనలేదని తెలిపారు. విశాఖపట్నంలో సోమ­వారం ప్రారంభమైన జైళ్లశాఖ జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతోను, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘సాక్షి’తోను మాట్లాడారు. నేరం చేసినవారు ఎంతటివారైనా చట్టం దృష్టిలో సమానులేనని చెప్పారు. టీడీపీ నాయకులు, కొన్ని చానళ్లు, పత్రికలు చట్టాన్ని, న్యా­య­­వ్యవస్థను తప్పుపట్టడం మంచిది కాద­న్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టు­కుని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తే, దాన్ని రాజకీయ వైరంగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నా­ర­న్నారు. రాజధానికి వేలా­ది ఎకరాల భూముల సేకరణ విషయంలో బినామీల పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణలో ఓటుకి కోట్లు కేసులో సాక్ష్యాధా­రాలతో అడ్డంగా దొరికిపోయాడన్నారు.

రాజ­ధానిలో అసైన్డ్‌ భూముల కుంభకోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారి భూము­­లను చంద్రబాబు, ఆయన మనుషులు దోచుకున్నారని చెప్పారు. ఏపీ ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమా­ండ్‌ చేశారు. చంద్రబాబుతో పాటు రామోజీ కొడుకు వియ్యంకుడు ఆర్‌.వి.ఆర్‌.రఘు కేంద్ర ఐటీశాఖ అధికారులకు దొరికిపోవడం వలన రాజధాని కుంభకోణాలు విచా­రించడానికి వీల్లే­దని వాదిస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఐటీ­శాఖ చంద్రబాబుకి అవినీతిపై నోటీసులిస్తే పచ్చమీడియా నోరు మెదపడం లేదన్నారు. రూ.2 వేలకోట్ల లావాదేవీలు చేశారని, చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ప్రధాన నిందితుడని ఐటీశాఖ సాక్ష్యాధారాలతో నోటీసులిచి్చనా విచారణగానీ, అరెస్ట్‌గానీ చేయకూడదా.. అని ప్రశ్నించారు. ఇంతకాలం చంద్రబాబు దేశంలో వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ, స్టేలు తెచ్చుకుంటూ కాలం గడిపారని చెప్పారు.

చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్ప­­డుతూ దుష్టచతుష్టయానికి వాటా­లు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌తో అవినీతి భాగస్వాముల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అవినీతికి పాల్ప­డిన కేసులో చంద్రబాబుని అరెస్ట్‌ చేస్తే ప్రతీకారంతో చేశారంటూ టీడీపీ, జనసేన, పచ్చమీడియా ప్రజలను నమ్మించేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు.

అవినీతి డొంక కదిలింది 
ఇంతకాలం చంద్రబాబు రాజకీయాలను వ్యాపా­­­రంగా మార్చుకుని అవినీతి సామ్రా­జ్యాన్ని నడిపారని హోంమంత్రి వనిత అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి డొంక కదిలిందని, ఒక్కో కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో లోకేశ్‌పైన కూడా అనుమానాలున్నాయని, సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. చం­ద్ర­బాబు అరెస్టు తర్వాత ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధించినట్లు చెప్పారు. దీనిపై పోలీసులు బాధ్యతా­యుతంగా వ్యహరించారని ఆమె పేర్కొన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)