Breaking News

చంద్రబాబు దళిత వ్యతిరేకి

Published on Wed, 11/08/2023 - 04:33

కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబే పెద్ద దళిత వ్యతిరేకి అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. టీడీపీ హయాంలో దళితులపై ఎన్నో అరాచకాలు, దాడులు జరిగాయని.. కానీ చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పంచాయి­తీలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కంచికచర్ల ఘటనలో నిందితులను అరెస్టు చేసినా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూ­­రులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లా­డారు.

ఎన్టీఆర్‌ జిల్లా కంచిక­చర్లకు చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేసి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించా­మని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి టీడీపీ నేతలు తట్టుకో­లేకపోతున్నారని విమర్శించారు.

విద్యార్థుల గొడవకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గతంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ అవహేళన చేశా­రని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను దళిత జాతి ఎప్ప­టికీ మరచిపోద­న్నారు. చంద్రబాబు పాలనలో దళి­తు­లపై ఎన్నో అరాచకాలు, దాడులు, అత్యాచా­రా­లు జరిగా­యని.. మహిళా ప్రజాప్రతినిధులపై దాడు­లకు ఒడిగ­ట్టా­రని గుర్తు చేశారు.

టీడీపీ రాష్ట్ర అధ్య­క్షుడు అచ్చెన్నాయుడు దళిత మహిళ కడుపుపై బూటు కాలుతో తన్నారని, అటువంటి నీచ సంస్కృతి టీడీపీదేనని విమర్శించారు. ఇప్పుడు రాజకీయ స్వప్ర­యోజనాల కోసం దళితులపై కపట ప్రేమ చూపి­స్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చు­కుని  సీఎం జగన్‌పై బురద జల్లడం వంటి నీచ రాజ­కీయాలు మానుకోవాలని వనిత హితవు పలికా­రు.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)