Breaking News

మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? డీఎంకేకు బీజేపీ సవాల్‌

Published on Fri, 02/21/2025 - 17:23

చెన్నై:  అటు బీజేపీ‍ ఇటు డీఎంకే. తమిళనాడు వేదికగా సాగుతున్న సోషల్ మీడియా రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో వారి సోషల్ మీడియా వార్ సాగుతోంది.  దీనింతటికీ ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ సోషల్ మీడియాలో డీఎంకే చేసిన హ్యాష్ ట్యాగ్ ప్రధాన కారణంగా నిలిచింది. 

గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే సాగుతోంది.  హిందీ భాషను అమలు చేయడాన్ని డీఎంకే(DMK) వ్యతిరేకిస్తోంది.  ఇది కాస్తా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు దారి తీసింది.  ఈ క్రమంలోనే డీఎంకే ఐటీ వింగ్ సోషల్ మీడియాలో ‘గెట్ అవుట్ మోదీ’  హ్యాష్ ట్యాగ్ ను కోడ్  చేసింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ సైతం ‘ గెట్ అవుట్ స్టాలిన్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను కౌంటర్ గా సోషల్ మీడియా(Social Media)లో వదిలింది. 

ఇరు పార్టీల ట్వీట్లకు సంబంధించి తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ కె అన్నామలై మాట్లాడుతూ..  ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లను కోడ్ చేస్తూ ‘ఎవరు గెలిచారో చూసుకుందామా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీఎంకేకు. ‘ మీరు గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను రాత్రి పూట్ రిలీజ్ చేశారు.  ఆపై ఉదయం ఆరు గంటలకు ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్‌లోకి తెచ్చాం.  ఇక్కడ ఎవరు హ్యాష్ ట్యాగ్ ఎక్కువ రీచ్ అయ్యిందో  చూద్దామా.  ఇందుకోసం మీకున్న  అన్ని వనరులను ఉపయోగించుకుండి. మన ఇద్దరి ట్వీట్లలో ఎవరిది ఎక్కవ ప్రజల్లోకి పోయిందో చూద్దాం’’ అంటూ డీఎంకే కు చాలెంజ్ విసిరారు అన్నామలై.

 

ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు అన్నామలై. ప్రధానంగా పిల్లలకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిందన్నారు. 

కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్‌

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)