Breaking News

అసెంబ్లీ నుంచి గవర్నర్‌ వాకౌట్‌

Published on Tue, 01/20/2026 - 11:22

సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో మరోసారి జాతీయ గీతం విషయంలో వివాదం చెలరేగింది. గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి అసెంబ్లీని వదిలి వెళ్లారు. తన సంప్రదాయ ప్రసంగాన్ని చదివేందుకు నిరాకరించారు. ఇదే జాతీయ గీతం ఆలాపన విషయంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ఇలాగే సభను వదిలి వెళ్లడం గమనార్హం.

చెన్నైలోని తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం సందర్భంగా గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవి సభలో ప్రవేశించారు. రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం వినిపించాలని ఆయన కోరారు. అయితే స్పీకర్ ఎం.అప్పావు అందుకు నిరాకరించారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం సమావేశం ముగిసిన తర్వాత  జాతీయ గీతం మాత్రమే వినిపిస్తారని వివరణిచ్చారు. దీనిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రారంభించక ముందే సభను వదిలి వెళ్లిపోయారు.

అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ..‘జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదు. నేను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులు ఉన్నాయి. నా మైక్ ఆఫ్ చేశారు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది అవమానం అని అన్నారు. ఆయన ప్రసంగాన్ని చివరికి స్పీకర్ చదివి వినిపించారు. ఈ ఘటనపై డీఎంకే నేతలు గవర్నర్ తీరును తప్పుబడుతుంటే.. బీజేపీ వర్గాలు మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. జాతీయ గీతానికి గౌరవం ఇవ్వకపోవడం తప్పు అని పేర్కొన్నారు.

జాతీయ గీలాపన విషయంలో గత మూడేళ్లుగా గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి అసెంబ్లీ సంప్రదాయ ప్రసంగాన్ని చదవకుండా నిరాకరించారు. 2024, 2025 సంవత్సరాల్లో కూడా ఇదే కారణంతో ఆయన సభను వదిలి వెళ్లారు.  

తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం వివాదం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. గవర్నర్ రవి చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందనలు కలిసి సాంస్కృతిక గౌరవం, రాజ్యాంగ సంప్రదాయాలు, రాజకీయ విభేదాలు అన్న మూడు అంశాలను ముందుకు తెచ్చాయి. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాని పక్షంలో, రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తతకు గురయ్యే అవకాశం ఉంది.

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)