తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం

Published on Sat, 07/18/2026 - 15:24

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ లక్ష్మణ్‌ ఇంటికి బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ వెళ్లారు. ఈటల, బండి సంజయ్‌ మధ్య సయోధ్య దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత విభేదాలపై ఇప్పటికే హైకమాండ్‌కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. నేతల విభేదాలకు చెక్‌ పెట్టాలని బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించింది.

కాగా, కమలదళానికి కాయకల్ప చికిత్స సిద్ధమైంది. బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యమైన అధికార సాధన అనే కీలక ఘట్టానికి చేరడంలో రాష్ట్రపార్టీ ఎదుర్కొంటున్న బలహీనతలు, ఇబ్బందులను జాతీయ అధినాయకత్వం గుర్తించింది. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేతల ఈగోలు, సమన్వయలేమి అనేవి ప్రధాన సమస్యలుగా మారాయని గుర్తించి ‘కీలెరిగి వాత’పెట్టేందుకు సమాయత్తమైనట్లుగా బీజేపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.

దశాబ్దాలుగా తెలంగాణలో బీజేపీకి గుర్తింపు ఉన్నా.. గత 10–15 ఏళ్లుగా పూర్తిస్థాయిలో రాజకీయంగా పుంజుకునే అవకాశాలున్నా వాటిని వినియోగించుకోకపోవడంపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ పూర్తిస్థాయిలో పుంజుకుని, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడానికి ముఖ్యనేతలంతా ‘ఎవరికి వారే యమునాతీరే’అన్నట్టుగా వ్యవహరిస్తుండడం ముఖ్యమైన సమస్యగా పరిణమించిందని వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో (3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు గెలుపు) ముఖ్యనేతల మధ్య గ్రూపుల సమస్య తీవ్రస్థాయికి చేరినట్లుగా వారు అంచనా వేసినట్లు సమాచారం.

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గ్రూపు రాజకీయాల కుంపట్లు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇక వాటికి చెక్‌ పెట్టాల్సిన రోజులు దగ్గరపడ్డాయని అగ్రనేతలు గుర్తించినట్లు సమాచారం. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన సీనియర్‌ నేతలకు, కొన్నేళ్ల క్రితం చేరిన వలస నేతలకు మధ్య తీవ్రస్థాయిలో నడుస్తున్న కోల్డ్‌ వార్‌కు సైతం చరమగీతం పాడాలని నిర్ణయించినట్టు సమాచారం.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)