Breaking News

‘నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమే’

Published on Thu, 07/17/2025 - 16:02

తాడేపల్లి : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దారుణాలకు దిగారని, మద్యం దుకాణాలపై కమీషనల్ల గుంజుతున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. ఇతరులకు వచ్చిన మద్యం షాపుల్ని సైతం లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, కళ్యాణదుర్గంలో ఎక్కడ చూసినా కళ్యాణి వైన్స్ అనే పేరుతోనే మద్యం షాపులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించారు. 

ఈ రోజు(గురువారం, జూలై 17) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తలారి రంగయ్య..  ‘ దినేష్ అనే సాధారణ వ్యక్తికి వచ్చిన మద్యం షాపుని కూడా లాగేసుకున్నారు. ఒక ప్రజాసంఘాల నాయకుడిని సైతం బెదిరించి తమవైపు తిప్పుకున్న చరిత్ర స్థానిక ఎమ్మెల్యేది. కళ్యాణదుర్గంలో మూడు వేల బెల్టు షాపులు ఏర్పాటయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తానని చెప్పిన సీఎంలను గతంలో చూశాం.  

కానీ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమే. గ్రామాల్లో మంచినీరు దొరకటం లేదుగానీ మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. బెల్టుషాపుల కోసం వేలం వేసి రూ.12 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి మద్యం సీసా మీద అధికంగా వసూలు చేస్తుంటే ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తోంది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ జనం చనిపోతున్నారు. అయినా ప్రభుత్వానికి ఏం పట్టడం లేదు

బెల్టు షాపులు పెడితే బెండు తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు?, రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తుంటే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ కట్ అయిపోతాయంటూ జనాన్ని భయపెడుతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)