Breaking News

గులాం నబీ అజాద్‌కు షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి తాజ్ మొహియుద్దీన్!

Published on Sun, 08/18/2024 - 16:38

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం గులాం నబీ ఆజాద్.. డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీకి  షాక్‌ తగిలింది. ఈ పార్టికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. ‘‘కొన్ని రోజుల్లో నేను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతాను. ఆజాద్‌ సాబ్‌ నాకు పార్టీలో చాలా గౌరవం ఇచ్చారు. ఆజాద్‌ కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను పూర్తి స్థాయిలో సంతోషంగా ఉంటాను. నాకు కాంగ్రెస్‌ పార్టీతో సుమారు 45 ఏళ్ల  అనుబంధం ఉంది. నేను మళ్లీ నా సోంత గూటికి చేరుకోబోతున్నా. 

అయితే నేను నా కార్యకర్తల అభిప్రాయాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నా. వారంతా నేను కాంగ్రెస్‌లో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అందుకే నేను మళ్లీ కాంగ్రెస్‌తో చేరనున్నాను’’ అని అన్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ అసెంబ్లీ సెగ్మెంట్ మాజీ ఎమ్మెల్యే అయిన మొహియుద్దీన్ 2022 ఆగస్టులో ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం ఆజాద్‌ పెట్టిన డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీలో చేరారు.

గులాం నబీ ఆజాద్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏఈప) కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. శనివారం తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్‌ చేరనున్నట్లు ప్రకటించటంతో ఊహాగానాలు మరింతి ఎకక్కువ అయ్యాయి. అయితే ప్రచారానన్ని డీపీఏపీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఖండించారు.

గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినప్పటి నుంచి ఆయనకు ఏ కాంగ్రెస్ నాయకుడు నేరుగా లేదా టెలిఫోన్ ద్వారా సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధం మాత్రమే అని అన్నారు.  గందరగోళాన్ని సృష్టించి తమ పార్టీని విచ్ఛిన్నం చేయడాని ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలిపారు.  ఈ ట్రాప్‌లో పార్టీ నాయకులు కార్యకర్తలు చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇక.. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌ 18, సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 1న, హరియాణాలో అక్టోబర్‌ 1న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్‌-డిసెంబర్‌లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?