Breaking News

జేసీ కోసమే పెద్దారెడ్డిని అడ్డుకున్నాం: పోలీసులు

Published on Mon, 08/18/2025 - 11:18

అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అయితే, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందనే కారణంగానే పెద్దారెడ్డిని అడ్డుకున్నట్టు పోలీసులు చెప్పడం గమనార్హం.

తాజాగా డీఎస్పీ వెంకటేషులు మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉంది. అందుకే నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నాం. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుంది. అన్ని విషయాలు హైకోర్టుకు విన్నవిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో, జేసీ కోసమే పెద్దారెడ్డి అడ్డుకున్నట్టు పోలీసులు బహిరంగంగానే ప్రకంటించేశారు.

మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం అంటూ సవాల్‌ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు.. ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలి అంటూ హెచ్చరించారు. దీంతో, పెద్దారెడ్డి ఇంటిని కూల్చి ప్లాన్‌ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి సహా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తాను. పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వామా?. జేసీ ప్రభాకర్‌ రెడ్డి చెప్పినట్టే పోలీసులు పనిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారు. నేను గతంలో ఫ్యాక్షనిజం చేయలేదు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.

ఇక, తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు వాహనాల్లో తాడిపత్రి వెళ్తున్నప్పటికీ, హైకోర్టు ఆదేశాలు చూపించినా.. బారికేడ్లు పెట్టి ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాలయాపన చేసి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకునే కుట్రలు పోలీసులే చేయడం గమనార్హం. 

	తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని ఆపేసిన పోలీసుల

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)