Breaking News

తాడిపత్రిలో పోలీసుల హైడ్రామా‌.. పెద్దారెడ్డి విషయంలో మరో ట్విస్ట్‌!

Published on Sun, 09/07/2025 - 09:27

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసులు మరోసారి హై డ్రామాకు తెరలేపారు. తాజాగా తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించడం గమనార్హం.

వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరో ట్విస్ట్‌ ఇచ్చారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రికి రావాలని పెద్దారెడ్డికి పోలీసులు చెప్పారు.

ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్పందిస్తూ.. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరారు. కానీ, లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమానాస్పద వైఖరిని పెద్దారెడ్డి ప్రశ్నించారు. అనంతరం, అనంతపురం ఎస్పీ జగదీష్‌కు కేతిరెడ్డి మెయిల్‌ పంపించారు. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి.. శనివారం ఉదయం తాడిపత్రిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)