Breaking News

దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయాం: హరీశ్‌ రావు

Published on Tue, 12/12/2023 - 15:44

సంగారెడ్డి: దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయాం.. బీఆర్ఎస్‌ ఒడిదొడుకులు కొత్త కాదని మాజీ మంత్రి  హరీశ్‌ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీశ్‌రావు మాట్లాడారు. పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత విద్యార్థి కుంగిపోతే ఇంకో పరీక్ష పాస్ కాలేడని అ​న్నారు. రానున్న రోజుల్లో స్థానిక, పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి పకడ్భంధీ కార్యాచరణతో ముందుకు పోదామని చెప్పారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. వాళ్లు మనకన్నా బాగా పాలిస్తారని ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. దుష్ప్రచారం కూడా కొంతపై చేయి సాధించిందని తెలిపారు. కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని, బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమేమని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని గెలిచినప్పుడు పొంగి పోలేదు.. ఓటమితో కుంగి పోలేదని తెలిపారు.

కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని, మనం ధైర్యం కోల్పోవద్దని ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందామని అన్నారు. మనకు పోరాటాలు కొత్త కాదని,భవిష్యత్ మనదేనని అ​న్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందని తెలిపారు.సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, కార్యకర్తలకే సంగారెడ్డి విజయం అంకితం చేస్తు​న్నానని తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)