Breaking News

కాంగ్రెస్‌ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ?

Published on Fri, 10/27/2023 - 13:07

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ అభ్యర్థుల మలి జాబితా ప్రకటన ఏమోగానీ.. పూటకో ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం ఉదయం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో గంటన్నరపాటు సాగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. ఈ సాయంత్రమే అన్ని స్థానాలకు ప్రకటన ఉంటుందని స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్‌. ఈ తరుణంలో మరో ప్రచారం వినవస్తోంది.    

తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందట. కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి, గజ్వేల్.. హరీష్‌రావు సిద్దిపేట..  కేటీఆర్‌ సిరిసిల్లలోనే ఈ పోటీ ఉండనుందని తెలుస్తోంది. బరిలోకి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మరోవైపు 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ సీఈసీ.. అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో 14 స్థానాల్ని మాత్రం పెండింగ్‌లో ఉంచింది. పెండింగ్‌ జాబితాలో ఖమ్మంలో ఇల్లందు.. పాలేరు, నల్లగొండ జిల్లాలో దేవరకొండ.. తుంగతుర్తి.. సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మక్తల్.. జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. 

మలివిడత జాబితా ఎప్పుడనేదానిపై స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ స్పష్టత ఇచ్చారు. ‘‘ఈరోజు సాయంత్రం 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేశాం. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరింది. ఏ స్థానాలు ఇవ్వాలి అనేదానిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుంది’’ అని తెలిపారాయన. 

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)