Breaking News

కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీ: బీజేపీ

Published on Tue, 09/02/2025 - 17:04

సాక్షి, హైదరాబాద్‌: కవిత సస్పెన్షన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. కవిత సస్పెన్షన్‌ బీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారంగా ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి  జరిగింది వాస్తవం.. ఆ అవినీతి సొమ్ము పంపకంలో  తేడాలు వచ్చాయి. అందుకే ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై కవిత మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే విషయం బీజేపీ చెబితే రాజకీయం అంటారు’’ అని రామచందర్‌రావు పేర్కొన్నారు.

అవినీతి డైవర్షన్‌.. కవిత సస్పెన్షన్‌: డీకే అరుణ
కవిత సస్పెన్షన్‌ను కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీగా ఎంపీ డీకే అరుణ అభివర్ణించారు. ఆ కుటుంబంలో అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కవిత ఏకంగా జైలుకే వెళ్లి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి డైవర్షన్‌లో భాగంగానే కవిత సస్పెన్షన్‌. బీఆర్‌స్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి’’ అంటూ డీకే అరుణ వ్యాఖ్యానించారు.

కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు: హరీష్‌బాబు
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ.. కవితపై వేటు పూర్తిగా కుటుంబ వ్యవహారమన్నారు. ‘‘కేసీఆర్‌ కుటుంబంలో లుకలుకలు బయటపడుతున్నాయి. కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు. కాళేశ్వరం అవినీతిలో ఇద్దరి పాత్ర ఉందని కవిత చెప్పారు. సీబీఐకి కవిత  పూర్తి వివరాలు అందించాలి’’ అని  హరీష్‌బాబు పేర్కొన్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)