Breaking News

స్వాతి మలివాల్‌ కేసులో సాక్ష్యాలు మాయం?!

Published on Sun, 05/19/2024 - 11:04

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్‌ కుమార్‌ రిమాండ్‌ నోట్‌ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్‌కుమార్‌ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. 

‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్‌గా  ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు  పేర్కొన్నారు.

‘‘ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్‌గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్‌ చేసేందుకు వీలుగా డిజిటిల్‌ వీడియో రికార్డర్‌ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ  పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కిందకు వస్తుంది.  

ఆ విభాగానికి చెందని ఓ జూనియర్‌ ఇంజనీర్‌ ఇచ్చిన పెన్‌ డ్రైవ్‌ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్‌గా వస్తోంది. జూనియర్‌ ఇంజనీర్‌ వద్ద డీవీఆర్‌ యాక్సెస్‌ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీ​పోలీసులు రిమాండ్‌ నోట్‌లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)