Breaking News

బీజేపీ వస్తే మమత జైలుకే: బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు

Published on Wed, 01/01/2025 - 07:35

కోల్‌కతా:పశ్చిమబెంగాల్‌ బీజేపీ నేత సువేందు అధికారి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, సీఎం మమతా బెనర్జీకి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మమత అరెస్టు తప్పదన్నారు. సందేశ్‌ఖాలీలో మహిళలను టీఎంసీ నేతలు వేధించిన ఘటనలకు మమత బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. 

‘2026లో బెంగాల్‌లో బీజేపీ పవర్‌లోకి వస్తే సందేశ్‌ఖాలీ ఘటనలపై విచారణ కమిషన్‌ వేస్తాం. సీఎం మమత కూడా జైలుకు వెళ్లకతప్పదు. సందేశ్‌ఖాలీలో మన తల్లులు, అక్కచెల్లెలను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు.

దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు’అని సువేందు అధికారి హెచ్చరించారు. మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించిన మరుసటి రోజే పోటీగా అక్కడ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సువేందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా,గతేడాది ప్రారంభంలో తృణమూల్‌ నేత షాజహాన్‌షేక్‌ తమ భూములు కబ్జా చేయడమే కాకుండా తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఉత్తరపరగణాల జిల్లా సందేశ్‌ఖాలీలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం షేక్‌షాజహాన్ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి