సువేందు అధికారి కాన్వాయ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత

Published on Tue, 08/05/2025 - 15:28

కూచ్ బెహార్‌: పశ్చిమబెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ కూచ్‌ బెహార్‌లో నిర్వహించిన ర్యాలీలో సువేందు అధికారి పాల్గొన్నారు. ఇటీవ‌ల బెంగాల్‌లో మ‌హిళ‌ల‌పై హింస, నేరాలు పెరుగుతున్న క్రమంలో టీఎంసీ సర్కార్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ర్యాలీ నిర్వహించగా.. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. దాడులకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

ఖగ్రాబారి ప్రాంతంలో సువేందు అధికారి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో నల్ల జెండాలు పట్టుకున్న నిరసన కారులు ‘వెళ్లిపో’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వాహనంపై చెప్పులు విసిరారు. పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా ధ్వంసమైంది. ఆ సమయంలోనే అధికార ప్రభుత్వానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పక్కా ప్లాన్‌ ప్రకారం ఆడుతున్న డ్రామాగా అంటూ టీఎంసీ నేతలు అభివర్ణిఇంచారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష గళాన్ని అణచివేయాలనే కుట్ర అంటూ బీజేపీ మండిపడింది. బుల్లెట్‌ప్రూఫ్ కారులో ఉండ‌డం వ‌ల్లే సువేందు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)