Breaking News

కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ సస్పెండెడ్‌ ఎంపీ

Published on Wed, 03/20/2024 - 18:17

లక్నో:పార్లమెంట్‌ ఎ‍న్నికల వేళ పలువురు కీలక నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు పార్టీలు మారుతూ రాజకీయ వేడిని పెంచుకుతున్నాయి. తాజాగా సస్పెండెడ్‌ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్‌ పార్టీ చేరారు. ఐదు రోజుల కింద డానిష్‌ అలీ  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న విషయం  తెలిసిందే. అయితే  ఆరోజు నుంచే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ఊహాగానాలు ఉచ్చాయి. 

అనుకున్నట్టుగానే ఆయన బుధవారం కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి సీట్ల పంపణీలో పొందినట్లు తెలుస్తోంది. 

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్రలో డానిష్‌ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు.  ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ,  విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్‌ అన్నారు.

మరోవైపు.. ‘కాంగ్రెస్‌ నేతలతో సన్నిహతంగా ఉంటుంన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు మరచిపోయారు. ఆ కారణంగా డానిష్‌ అలీని సస్పెండ్‌ చేస్తున్నాం’ బీఎస్పీ గతేడాది ఆయన సస్పెన్షన్‌పై వివరణ  ఇచ్చింది. డానిష్‌ అలీపై బీఎస్సీ పార్టీ ఎంపీ  రమేష్‌ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. అలీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)