Breaking News

బీసీల పక్షాన కాంగ్రెస్‌కు మద్దతివ్వండి

Published on Sun, 07/30/2023 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బీసీ సంఘాల పక్షాన తమకు మద్దతివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, మాజీ ఎంపీ వి.హనుమంతరావు శనివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వెళ్లి ఆర్‌. కృష్ణయ్యను కలిశారు.

బీసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని, బీసీల కులగణన చేపట్టాలన్న డిమాండ్‌కు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారని వారు గుర్తు చేసి.. తమకు సంఘీభావం తెలపాలని కృష్ణయ్యను  కోరారు.

ఇందుకు స్పందించిన ఆయన బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్‌ నేతల ముందుంచి వాటిని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్య ఆఫీసుకి,  ఇంటికి ఠాక్రే, వీహెచ్‌ వెళ్లారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. 

రాజకీయాలకు సంబంధం లేదు: కృష్ణయ్య
ఠాక్రే, వీహెచ్‌లతో సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని, బీసీ డిమాండ్లపైనే చర్చ జరిగిందని చెప్పారు. బీసీ సంఘం అధ్యక్షుడిగా మాత్రమే వారు తనను కలిశారని స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టాలని కోరానని, అందుకు కాంగ్రెస్‌ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ పక్షాన బీసీ బిల్లు పెట్టి 14 పార్టీల మద్దతు కూడగట్టామని వెల్లడించారు.

బీసీల పట్ల కాంగ్రెస్‌ వైఖరి స్పష్టం: ఠాక్రే
ఆర్‌.కృష్ణయ్యతో చర్చల తర్వాత ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఓబీసీలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, అందుకే  కృష్ణయ్యతో మాట్లాడేందుకు తాము వచ్చామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్‌ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కాగా, బీసీ సంఘం కార్యాలయంపైనే ఉన్న  కృష్ణయ్య నివాసంలోకి ఠాక్రే, వీహెచ్‌లు వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)