Breaking News

‘బీజేపీ ఆఫర్‌ చేస్తే.. కేంద్రంలో మంత్రి పదవి స్వీకరిస్తా’

Published on Sat, 06/15/2024 - 13:31

ముంబై: కేంద్ర​ కేబినెట్‌లో మంత్రి పదవి అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్  సతీమణి సునేత్రా పవార్‌ అన్నారు. ఆమె ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్‌ పవార్‌) పార్టీ కంచుకోట స్థానమైన బారామతిలో పోటీ చేసి ఆ పార్టీ నేత సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా సునేత్రా పవార్‌ రాజ్య సభ  ఉప ఎన్నికల  కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థి లేకపోవటంతో సునేత్రా గెలుపు ఖాయమని తెలుస్తోంది. 

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సునేత్ర మాట్లాడుతూ.. ‘కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే కచ్చితంగా స్వీకరిస్తాను. ఆ ఆవకాశాన్ని వినియోగించుకుంటా. బారామతిలో మేం హోరంగా ఓడిపోయాం. ఓటమికిగల కారణాలుపై విశ్లేషణ చేస్తాం, తగిన క్షేత్రస్థాయి చర్యలు తీసుకుంటాం’’ అని ఆమె అన్నారు.

మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ లోక్‌​ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో భాగంగా ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ పార్టీకి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. అయితే ఈ పార్టీకి చెందిన సీనియర్‌ నేత ప్రఫూల్‌ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా) ఇస్తామని బీజేపీ ప్రతిపాదించింది. కాగా.. ఆయన గతంలోనే కేంద్ర కేబినెట్‌ మినిస్టర్‌గా పనిచేసి ఉండటంతో బీజేపీ ఇచ్చిన  సహాయ మంత్రి పదవి ఆఫర్‌ను తిరస్కరించారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)