Breaking News

వలంటీర్లపై బాబు కూటమి కుట్ర

Published on Sat, 11/09/2024 - 04:36

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థ లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయకుండా తప్పించుకునేందుకే కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

 వలంటీర్లకు సంబంధించి ఎలాంటి వ్యవస్థ లేదని, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని, దాని వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నామని డిప్యూటీ సీఎం పవన్‌­కళ్యాణ్‌ చెప్పడమూ ఈ కుట్రలో భాగ­మేనన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభు­త్వం ప్రభుత్వ పథ­కాలు, కార్యక్రమాలను పూర్తి పారద­ర్శకంగా ఇంటి గడప వద్దే అందించడం కోసం 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియామకానికి ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ శాఖ బాధ్యతను ఒక మంత్రికి అప్పగించిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా మంత్రి డోలా బాల వీరాంజనే­యస్వామికి ఆ శాఖను కేటాయించారన్న విషయం తెలుసుకోవాలన్నారు.

వలంటీర్ల నియామకంపైనా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, పవన్‌ ఆ జీవోలు తెప్పించుకుని చూడా­లని చెప్పారు. అంత పక్కాగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దానిపై పవన్‌ వెటకారంగా మాట్లా­డుతున్నారని దుయ్యబ­ట్టారు. వలంటీర్ల వ్యవస్థపై టీడీపీకి, జనసేన పార్టీకి సదభిప్రాయం లేదనడానికి గతంలో చంద్రబాబు, పవన్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.  ప్రజలకు వలంటీర్లు అందించిన సేవలు ఎనలేనివని, కోవిడ్‌ బాధితు­లను వారి కుటుంబ సభ్యులే పట్టించుకోకపోతే వీరు ప్రాణా లకు తెగించి సేవలందించారని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్‌ క్షమాపణలు చెప్పాలని అన్నారు. 

ఎన్నికల్లో వలంటీర్లకు కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వారిన తిరిగి విధుల్లోకి తీసు­కొని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. వలంటీర్లకు ఏ హామీ ఇవ్వలేదని కూటమి నేతలు అనుకొంటే.. తిరుమల శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని సుధాకర్‌బాబు సవాల్‌ చేశారు.

నేడు వలంటీర్ల ఆవేదన సదస్సు 
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు  వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్‌ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని, ఐదు నెలల పెండింగ్‌ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు.      

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)