Breaking News

తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు

Published on Tue, 09/30/2025 - 15:09

దేశంలో ఇంతపెద్ద రాష్ట్రాన్ని అయినా జయిస్తున్న భారతీయజనతా పార్టీకి దక్షిణాది మాత్రం కోరుకుడుపడడం లేదు.. ఇటువైపున్న ద్రావిడ రాష్ట్రాలు తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. ఏపీ.. తెలంగాణ.. పాండిచ్చేరి.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంతమాత్రమే.. ఏదో నానా యాతనా పడి..ఏదోలా కర్ణాటకలో ఏదోలా అధికారం దక్కించుకున్నా అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతోంది తప్ప మళ్ళా అక్కడ అధికారాన్ని నిలుపుకోవడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. ఇక ప్రాంతీయపార్టీలు ఆలవాలమైన తమినాడులో అయితే దశాబ్దాలుగా పోరుతున్నా  బీజేపీ అడుగుకూడా పెట్టేందుకు వీలు చిక్కడంలేదు. 

అక్కడ ఉంటే అన్నాడీఎంకే.. కూడా డీఎంకే.. ఇక మిగతావన్నీ చిన్నా చితకాపార్టీలు మాత్రమే.. దేశాన్ని 75 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కూడా తమిళనాట నాడు కరుణానిధి.. నేడు స్టాలిన్ చాటున మనుగడసాగించడమే తప్ప సొంతంగా అక్కడ సాధించిందేమీ లేదు.. ఇక బీజేపీ మాత్రం ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని తీవ్రంగా  తాపత్రయపడుతోంది.  ఆ రాష్ట్ర శాసన సభలో 234 సీట్లుండగా అక్కడ 2026 ఏప్రిల్.. మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రస్తుతానికి  46 శాతం ఓట్లు సాధించిన స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే 159 సీట్లు సాధించి అధికారంలో ఉంది.. తరువాత 74 సీట్లతో పాళనిస్వామి సారథ్యంలోనే అన్నా డీఎంకే ప్రతిపక్ష పాత్రలో ఉంది.. ఇక ఇక్కడ బీజేపీకి స్థానం తక్కువే.. కానీ ఆశ చావని బీజేపీ నేతలు దింపుడుకల్లం ఆశతో తమిళనాడువైపు చూస్తూనే ఉన్నారు..

ఇదిలా ఉండగానే మొన్న సినిమా నటుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ రాజకీయ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించగా వందమందికి పైగా గాయపడ్డారు.. ఇది రాజకీయ సభలకు సంబంచింది దేశంలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెబుతున్నారు.. అయితే ఈ ప్రమాద సంఘటన తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ఎంపీ హేమామాలిని సారధ్యంలోని ఎనిమిది మంది ఎంపీలతో ఒక కమిటీని వేసింది.  తెలుగుదేశం.. శివ సేన వంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకూ ఈ కమిటీలో స్థానం కల్పించిన బీజేపీ అక్కడి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ సభలో జరిగిన ప్రమాదాన్ని సైతం రాజకీయంగా ఎలా వాడుకోవాలన్నదానిగురించి బీజేపీ  యోచన చేస్తోంది. 

అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై  స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2. 62 శాతం ఓట్లు తెచ్చుకుని కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీకి అన్నా డీఎంకేతో వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.. ఈ విజయ్ సభ ప్రమాదాన్ని సైతం బీజేపీ రాజకీయంగా వినియోగించుకునే అవకాశాన్ని  అన్వేషిస్తోంది.  ప్రాంతీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగా వాడుకుని లబ్ధిపొందుతారుతప్ప వారి యోగ క్షేమాలు.. భద్రతా ఏమాత్రం పట్టించుకోవు అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఈ ప్రమాదాన్ని సామాజిక అంశంగా మార్చుకుని రాజకీయంగా లబ్ధిపొందడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వెతుకుతోంది.. ఇకనైనా రాష్ట్రంలో అన్నా డీఎంకేతో కలిసి అధికారంలోకి వస్తుందా చూడాలి..
  సిమ్మాదిరప్పన్న

ఇదీ చదవండి: 
అలాంటి పని విజయ్‌ ఏనాడూ చేయబోరు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)