Breaking News

సీఎం ‘సమోసా’ వివాదం.. దర్యాప్తు ఏం లేదు: సీఐడీ

Published on Fri, 11/08/2024 - 17:58

హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో ‘సమోసా’ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐడీ కార్యాలయంలో సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయనకు ఇవ్వాల్సిన సమోసాలు మాయం అయినట్లువార్తలు రావడంతో..ఈ అంశంపై వివాదం చెలరేగింది.. దీనిపై సీఐడీ దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు ఆరోపణలు రావడంతో.. తాజాగా దర్యాప్తు సంస్థ స్పందించింది. తాము ఎలాంటి విచారణ చేపట్టలేదని స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న  ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్‌ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తినేశారని వార్తలు వచ్చాయి. సీఎం వద్దకు చేరాల్సిన అవి ఎవరి వల్ల మధ్యలో మిస్‌ అయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

ఈ మేరకు హిమాచల్‌ ప్రదేశ్‌ సీఐడీ డైరెక్టర్‌ జనరల్‌ సంజీవ్‌ రంజన్‌ ఓజా మాట్లాడుతూ.. సమోసాలు కనిపించకుండా పోవడంపై ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని తెలిపారు. ఇది అంతర్గత విషయమని చెప్పారు. అయితే అధికారుల సమావేశానికి ఆర్డర్‌ చేసిన స్నాక్స్‌ బాక్స్‌లు కనిపించకుండా పోవడంపై ఆశ్చర్యం వేయడం చాలా సాధారణమైన విషయమని అన్నారు.దీనిపై విచారణ ఏం లేదని,  కేవలం బాక్సుల గురించి తెలుసుకోవడానికి ఒక విజ్ఞప్తి మాత్రమే జరిగిందని  చెప్పారు.

మరోవైపు  ప్రతిపక్ష బీజేపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిందిు. ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారమని, సమోసాలను ఎవరు  తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. ‘సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 

ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ప్రభుత్వం అటువంటి విచారణకు ఆదేశించలేదని, ఈ విషయంతో సంబంధం లేదని చీఫ్‌ మీడియా అడ్వైజర్‌ నరేష్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఇది సీఐడీ అంతర్గత వ్యవహారమని చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)