Breaking News

కంచుకోటలో కాంగ్రెస్‌ ‘కథ’ కంచికేనా?

Published on Mon, 03/04/2024 - 08:43

సాక్షి, తిరువనంతపురం : 2024 ఏడాదిని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ పొలిటికల్‌ ఇయర్‌గానే భావిస్తున్నాయి. దేశ నేతలు, ప్రజలందరి దృష్టి రాబోయే లోక్‌సభ సమరంపైనే ఉంది. 2023లో 5 రాష్ట్రాల ఎన్నికల తంతు ముగియగా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించి రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికలపైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. దక్షిణాదిలోనూ అత్యధిక స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాషాయ పార్టీ. అందుకు తగ్గట్లుగానే వ్యూహరచన చేస్తోంది. 

ఇందులో భాగంగా వామపక్ష భావజాలం ఉన్న కేరళపై గురిపెట్టింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. కేరళలో మాత్రం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. అయితే, కాంగ్రెస్‌ లోక్‌సభ స్థానానికి కంచుకోటగా ఉన్న తిరువనంతపురాన్ని బద్దలు కొట్టాలని చూస్తోంది. రాజకీయ చైతన్యం కలిగిన కేరళలో బీజేపీ గెలిచి.. దక్షిణాదిలో తమకు తిరుగు లేదని నిరూపించాలని యోచిస్తోంది.     

గెలపుపై కాషాయం నేతల ధీమా
తాజాగా ప్రకటించిన బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో తిరువనంతపురం సీటును కేంద్ర మంత్రికి కేటాయించింది. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేని కేరళలో కూడా తామే గెలుస్తామని కాషాయం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

శశి థరూర్‌పై కేంద్ర మంత్రి.. 
కాబట్టే కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్‌ చంద్రశేఖర్‌ని తొలిసారి కేరళ రాజధాని తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. రాజీవ్‌ చంద్రశేఖర్‌ లోక్‌సభ స్థానం పోటీ చేయడం ఇదే తొలిసారి. 


గెలుపు గుర్రాలపై ఆసక్తి..
ఇక తిరువనంతపురం లోక్‌సభ గెలుపు గుర్రాలపై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ఏడాది జనవరిలో కేరళ బీజేపీ సీనియర్‌ నేత ఒ.రాజగోపాల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్‌ని ఓడించడం కష్టమని అన్నారు. అందుకే థరూర్‌ తిరువనంతపురం నుండి పదే పదే గెలుస్తున్నారు. భవిష్యత్తులో అదే స్థానంలో శశిథరూర్‌ కాకుండా మరో నాయకుడు గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

టార్గెట్‌ దక్షిణాది
లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో శ్రమిస్తోంది. 2019లో దేశం మొత్తం 303 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే ఏడాది దక్షిణాదిలో 129 లోక్‌సభ స్థానాల్లో (పుదుచ్చేరితో కలిపి 130) బీజేపీ కేవలం 29 సీట్లకే పరిమితమైంది. ఈ సారి ఆసంఖ్యను మరింత పెంచేలా దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నేసింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కమలం అగ్రనేతల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సైతం వరుస పర్యటనలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ పర్యటనల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)