Breaking News

Chandrababu: వృద్ధనారీ పతివ్రత

Published on Thu, 03/06/2025 - 16:16

చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకేలా ఉన్నారు.. అందితే జుత్తు..అందకపోతే కాళ్ళు పట్టుకోవడంలో ఆయన మాస్టర్ డిగ్రీ చేశారు. రాజకీయంగా తనకు అవసరమైనవాళ్లను మాత్రమే దగ్గర ఉంచుకుని ఒక్కోమెట్టు పైకెక్కిన అయన తనకు అవసరం లేనివాళ్లను తొక్కుకుంటూ ముందుకు వెళ్లారు. ఎవరి అండదండలు తన ఎదుగుదలకు నిచ్చెనమెట్లుమాదిరి ఉపయోగపడ్డాయో.. పైకెక్కక ఏవ్ నిచ్చెనను విరిచేసి మూలపెట్టేశారు . డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబులో పరివర్తన వచ్చిందో... ఇంకా వైరం ఎందుకని అనుకున్నారోకానీ చరమాంకంలో అయన తన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావును పొగడ్తలతో ముంచెత్తారు. 

చంద్రబాబు పెద్దల్లుడిగా దగ్గుబాటి ఆనాడు కేబినెట్లో చక్రం తిప్పుతున్న రోజులవి. వాస్తవానికి చదువు.. కుటుంబం.. సామాజిక హోదా విషయంలో వెంకటేశ్వర రావు అన్నిటిట్లోనూ చంద్రబాబు  కన్నా పైమెట్టులో ఉంటారు. అయినా రాజకీయంలో మాత్రం అయన వెనుకబడ్డారు.. ముఖ్యంగా ఎన్టీయారును పదవినుంచి తొలగించే సమయంలో తోడల్లుడు దగ్గుబాటిని ఒక మెట్టుగా వాడుకుని తనకు ఒక కంఫర్ట్ పొజిషన్ ఎమ్మెల్యేల సమీకరణ  అంతా తాను తన మద్దతుదారులైన మీడియా సంస్థలు సహాయంతో సానుకూలంగా సాగిపోగానే నెమ్మదిగా దగ్గుబాటిని సైడ్ చేయడం మొదలు పెట్టారు.. 

ఆ తరువాత తాను ఫోన్ చేసినా చంద్రబాబు లిఫ్ట్ చేయలేదని దగ్గుబాటి చెప్పుకున్నారు. ఆ తరువాతి పరిణామాల్లో చంద్రబాబు తెలుగుదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు పోటీ అనుకున్నవాళ్లను. సమర్థత.. పార్టీలో గౌరవం గుర్తింపు ఉన్న దగ్గుబాటివంటి వారిని వారంతట వాళ్ళే పార్టీనుంచి వెళ్లిపోయేలా చేసారు.. ఇదంతా గతం.. కానీ ఇప్పుడు ఇద్దరూ వృద్ధులయ్యారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర కామెంట్స్

ఇప్పుడు దగ్గుబాటి నుంచి ముప్పు లేదుగా
దగ్గుబాటి వెంకటేశ్వర రావు మొదటినుంచి మంచి అవగాహన ఉన్న వ్యక్తి.. జాతీయ అంతర్జాతీయ సామాజికాంశాలు గమనించి పుస్తకాలూ రాయడం అయన హాబీ కమ్ వ్యసనం.. ఆ క్రమంలోనే "ప్రపంచ చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చంద్రబాబుకు తోడల్లుడు దగ్గుబాటిలో ఎన్నో సుగుణాలు కనిపించాయి. బిజీగా ఉండే దగ్గుబాటి వంటి వ్యక్తి రిటైర్ అయ్యాక జీవితం ఎలా గడుపుతున్నారో తెలుసుకున్నాను.. నేనూ రిటైర్మెంట్ కు సిద్ధం అవుతున్నాను అన్నారు.. అంతేకాకుండా వెంకటేశ్వర రావుతో తనకు వైరం ఉందని అందరూ అనుకుంటారు అంటూనే.. ఒకప్పుడు చాలా వైరం ఉండేదని. ఇప్పుడు లేదని.. తామంతా కలిసిపోయామని కవరింగ్ ఇచ్చారు. 

ఇప్పుడు తామంతా ఒకటే అని చెప్పేందుకు తాపత్రయ పడ్డారు.. అవును  ఇప్పుడు మీరంతా ఒక్కటే .. తెలుగుదేశాన్ని క్యాడర్ ను పార్టీ నిధులను కొట్టేసి. తోడల్లుడిని ఆనాడు తొక్కేసి తనకు ఎవరూ పోటీ కారాదని అంతా నీ గుప్పెట్లోకి తెచ్చుకున్నావు.. ఇప్పుడు నీకు ఎదురులేదు కాబట్టి.. ఇప్పుడు దగ్గుబాటి మీకు మళ్ళీ బంధువయ్యాడు.. ఇప్పుడు కూడా అయన మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయితే.... నీకు పోటీ వస్తాడనిపిస్తే మళ్ళీ తొక్కేయడానికి ఏమాత్రం సందేహించవు అని సగటు టిడిపి కార్యకర్త లోలోన గొణుక్కుంటున్నాడు..
- సిమ్మాదిరప్పన్న

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)