Breaking News

ప్రియాంక విజయానికి ‘స్పెషల్‌ 24’!

Published on Mon, 04/29/2024 - 07:05

యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్‌బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది.  ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్‌ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.

రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్  ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్‌చంద్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్‌సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని  ఎమ్మెల్యే  సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్‌బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు  శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌, ఉత్తరప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ అవినాష్‌ పాండే, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్‌బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)