Breaking News

ముగిసిన విచారణ.. వచ్చే నెల 18న మహేశ్వర్‌ రెడ్డి విచారణ

Published on Fri, 01/30/2026 - 10:39

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ ఫిరాయింపుల కేసుపై స్పీకర్‌ గడ్డం ‍ప్రసాద్‌ విచారణ చేపట్టారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని రెండు అఫిడవిట్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్లు వేశారు.

ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి వేసిన అఫిడవిట్‌పై దానంను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విచారించారు. సుమారు రెండు గంటల పాటు విచారించినట్టు తెలిసింది. మరోవైపు.. పాడి కౌశిక్, ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే, దానం అనర్హత పిటిషన్ విచారణకు బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి తన లాయర్లను పంపించారు. ఈరోజు విచారణకు సంబంధించి ఎవిడెన్స్ అఫిడవిట్‌ను లాయర్‌తో పంపించారు. కాగా, తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికల పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఎవిడెన్స్ అఫిడవిట్‌లో దానం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా 2024 పోటీ చేసిన డాక్యుమెంట్స్ పొందుపరిచారు. తాను స్వయంగా హాజరు కావడానికి ఫిబ్రవరి 20 వరకు గడువు ఇవ్వాలని కోరడంలో స్పీకర్‌ అనుమతి ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను ఫిబ్రవరి 18న విచారించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

ఇదే కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వచ్చారు. ఇందు కోసం కౌశిక్‌ రెడ్డి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ..‘మేం ఇచ్చిన నోటీసులపై విచారణ కోసం స్పీకర్ రమన్నారు. దానం నాగేందర్‌ను స్పీకర్ సస్పెండ్ చేస్తాడని నమ్ముతున్నాం. దానం బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారు. దానం పోటీ చేసిన దాని కంటే పెద్ద ఆధారం ఏముంటుంది?. దానం పోటీ చేసిన అంశాలు, ఆయనకి వచ్చిన ఓట్లు తదితర డాక్యుమెంట్లు స్పీకర్‌కు ఇస్తాను అని చెప్పుకొచ్చారు. ఈరోజు విచారణలో భాగంగా కాసేపటి క్రితమే దానం నాగేందర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి విచారణ ముగిసింది. 
 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)