Breaking News

ఎన్డీయే సర్కార్‌ త్వరలో పడిపోతుంది: అఖిలేష్‌ యాదవ్‌

Published on Sun, 07/21/2024 - 17:19

కోల్‌కత్తా: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఎక్కువ కాలం పాలన కొనసాగించలేదు.. త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్. మతం పేరిట రాజకీయాలు ఎన్నో రోజులు నిలబడవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, అఖిలేష్‌ యాదవ్‌ ప్రస్తుతం బెంగాల్‌లో ఉన్నాఉ. ఈ సందర్బంగా అఖిలేష్‌ ఆదివారం బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం జరిగిన ‘ధర్మతల ర్యాలీ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు. కానీ, అంతిమంగా ఓడిపోతాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారు. అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారు.

ఇదే సమయంలో బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిది నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్’ అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇదిలా ఉండగా.. కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)