Breaking News

‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు

Published on Thu, 04/04/2024 - 12:13

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్‌ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్‌పట్‌ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. 

ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్  సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్‌ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్‌పై సమాజ్‌వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్‌సింగ్‌ను పోటీకి నిలబెట్టింది. 

పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్‌ ప్రధాన్ ‘ఎక్స్‌’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్‌ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్‌ ప్రధాన్‌ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్‌పట్‌లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్‌పాల్ శర్మను బరిలోకి దింపింది.

ప్రత్యర్థుల విమర్శలు
సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.  "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)